సారంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..

0
27

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

నిరుపేద కుటుంబాల వైద్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో ఉపయోగపడుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు పేర్కొన్నారు. సారంపల్లి గ్రామానికి చెందిన కోల అనిత – లక్ష్మణ్ దంపతులకు రూ. 14,500 విలువైన CMRF చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా కోల అనిత – లక్ష్మణ్ కుటుంబ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కెకె మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్ (టోనీ) లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్, సుంచుల కిషన్, గడ్డమీది శ్రీనివాస్, సిరిసిల్ల దేవదాస్, కునవేణి వినోద్, కోల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here