సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బీజేవైఎం మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. తనతోపాటు బీజేవైఎం లో పనిచేస్తున్న సుమారు 15 మంది కార్యకర్తలు కూడా రాజీనామా చేశారు. బిజెపి పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. త్వరలో 200 మంది కార్యకర్తలతో బిఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు.బీజేవైఎం ఉపాధ్యక్షులు భీమనాతిని ప్రకాష్,పిట్టల సాయికుమార్,రాధా వినయ్ కుమార్,కార్యదర్శి శివ, అభిషేక్,స్వామి,రంజిత్, సాగర్,అరుణ్,వికాస్,చందు, సురేష్,నితిన్,పవన్ పాల్గొన్నారు.