బలగం టీవి , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలోని రెడ్డి కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనలో భాగంగా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వచ్చిన దరఖాస్తులు తిరస్కరించకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి,కర్ణాకర్, దేవిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.