బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.
మొదటి రోజు 132 మంది విద్యార్థులు గైర్హాజరు..
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా జనరల్ 3,551, అలాగే ఒకేషనల్ విద్యార్థులు 513 మంది మొత్తం కలిపి 4,064 మంది హాజరు కావాల్సి ఉండగా, జనరల్ 3,470, అలాగే ఒకేషనల్ విద్యార్థులు 462 మంది హాజరయ్యారు. జనరల్ 81, అలాగే ఒకేషనల్ విద్యార్థులు 51 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.