ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం.
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
భూ భారతి అమలుపై ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్షించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సోమవారం నిర్వహించారు. భూ భారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల స్థితిగతులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. భూ భారతి లో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల వివరాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రణాళిక ప్రకారం కసరత్తు చేసి పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, పర్యవేక్షకులు వేణు, సురేష్, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
