హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం అమలు పై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.



