సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో రంగుల హోలీ సంబరాలు..

0
54
  • జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు..
  • జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు,సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు.
  • అధికారులు,సిబ్బందిలో స్టెప్పులతో ఉత్సాహాన్ని నింపిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగను అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు పూసుకుంటూ, బ్యాండ్ మేళాల మధ్య స్టెప్పులు వేస్తూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు.

నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమై ఒత్తిడితో గడిపే పోలీసు సిబ్బందికి ఈ హోలీ వేడుకలు మంచి ఉపశమనాన్ని, ఉల్లాసాన్ని అందించాయి. కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సోదరభావంతో రంగుల పండుగలో పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ.. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం,ఐక్యత,కోత్త ఉత్సాహం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసుల జీవితాల్లో కూడా ఇలాంటి పండుగలు సంతోషం, ఉత్సాహాన్ని నింపాలని తెలిపారు. పరస్పరం రంగులు పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ అధికారులు, సిబ్బంది హర్షాతిరేకాలతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. పోలీసు కుటుంబంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడేలా ఈ వేడుకలు నిర్వహించబడినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here