బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
బీసీ సాధికారిత సంఘం పక్షాన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో బీసీ సంఘ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోలాసనరేందర్ ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ బీసీ ప్రధాన కమిటీ,యువత బీసీ కమిటీ,మహిళా బీసీ కమిటీలను ప్రకటించి వారికి నియామక పత్రాలను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ అందజేశారు.
నూతన కమిటీలను ఉద్దేశించి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు సంఘ కమిటీలు పారదర్శకంగా,పటిష్టవంతంగా పనిచేయాలన్నారు.సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య మాట్లాడుతూ బీసీలు జనాభా ప్రాతిపదిక పైన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని అందుకు సరిపడా నిధులను బడ్జెట్లో కేటాయించాలని ముఖ్యంగా బీసీలు రాజకీయంగా,ఆర్థికంగా సామాజికంగా,విద్యా పరంగా, ఉద్యోగ పరంగా ఎదుగుదల చెందుటకు ప్రభుత్వాలు కృషి చేయాలని బాలయ్య కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారంగా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని గత ఎన్నికలలో బీసీలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా అధ్యక్షులు గుజ్జే శివరాం మాట్లాడుతూ బీసీ లు సంఘటితంగా వుండి మన హక్కులను సాధించుకోవాలని తెలిపారు. జిల్లా యువత అధ్యక్ష అంకారపు మహేష్ మాట్లాడుతూ నిరుద్యోగ బిసి యువతకు ఉద్యోగాలు ఇతర ఉపాధి అవకాశాలను కల్పించాలని అలాగే విద్యలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రీయంబర్స్మెంట్ వంటి బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.మహిళా సంక్షేమం కొరకు బీసీ జనాభా ప్రాతి పదికన ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని అన్ని రంగాలలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జె తార ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట వెంకటేశం,పత్తిపాక పద్మ,ఆడెపు చంద్రకళ మరియు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య,జిల్లా నాయకులు గోశిక శ్రీనివాస్ మరియు బీసీ నేత కందుకూరి రామ గౌడ్ నూతనంగా ఎన్నిక కాబడ్డ పట్టణ గౌరవాధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్,పట్టణ అధ్యక్షులు గుజ్జే శివరాం,పట్టణ ప్రధాన కార్యదర్శి జక్కని రవి,యువత కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అన్నారపు వేణుగోపాల్,వెల్దండి సాయి కృష్ణ మరియు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వంకాయల కావ్య,కొత్వాల్ ప్రమీల,ఉపాధ్యక్షులు చింతకుంట పద్మ మరియు కమిటీల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.