*కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి.జెడ్పిటిసి నర్సయ్య.
బలగం టివి, , ముస్తాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మండల నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి గుండం నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో మాట్లాడడం సరైంది కాదన్నారు.సరైన పద్ధతిలో మాట్లాడడం నేర్చుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోక తప్పదని హెచ్చరించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ప్రభుత్వాన్ని విమర్శించడం ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని అహంకార మాటలను సహించేదని పేర్కొన్నారు.అధ్యక్షుడు మాట్లాడుతూ బాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే నీ నాలుక కోస్తారని హెచ్చరిస్తూ కల్వకుంట్ల కుటుంబానికి బానిసవు అని ధ్వజమెత్తారు.బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే మీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు,ఎంపిటిసి శ్రీనివాస్,బీసీ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రశాంత్,నర్సయ్య, సీనియర్నాయకులు,రాజిరెడ్డి, దీటి నర్సింలు.అనమేని రాజు, కిషన్,నాయకులు ఆంజనేయులు,మహేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
