ఎన్సీడీ కార్యక్రమం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి..

0
42
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD – అసంక్రమిత వ్యాధులు) కార్యక్రమం అమలుపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ రజిత అధ్యక్షతన శుక్రవారం (5.12.2025) సిరిసిల్లలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్. సత్యేంద్రనాథ్ ముఖ్య వక్తగా పాల్గొని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) ఎన్సీడీ స్టాఫ్ నర్సులకు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు (MLHPs) కార్యక్రమం అమలు తీరును వివరించారు.

డాక్టర్ రజిత, డాక్టర్ సత్యేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఎన్సీడీ కార్యక్రమం (మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు) కింద నమోదు చేసిన డేటాను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేయాలి. నమోదు ప్రక్రియలో భాగంగా ఆభా (ABHA) కార్డులను ఆన్‌లైన్‌లో జనరేట్ చేయాలి. ఎన్సీడీ కార్యక్రమంలో నమోదు చేసిన వారికి సకాలంలో చికిత్స అందించి, గ్రామంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి. కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే, ఎన్సీడీ డేటా కార్యక్రమానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ అనిత, డాక్టర్ నయీమా, డిడియం కార్తీక్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here