బలగం టీవీ,రాజన్న సిరిసిల్ల :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ ఆర్ రజిత ఆధ్వర్యంలో (పీసీపీ ఎన్ డి టి ) గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అనే కార్యక్రమం పై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో గల స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది. ఫారం ఎఫ్ రికార్డులను, రిపోర్టులను పరిశీలించి లోపాలను గుర్తించడం మరియు సరి చేసుకోవలసిందిగా నిర్వాహకులకు, డాక్టర్లకు ఈ సందర్భంగా సూచించడం జరిగింది.

ఈ తనిఖీ కార్యక్రమంలో పి ఓ ఎంహెచ్ఎన్ ఇంచార్జ్ డాక్టర్ సంపత్ కుమార్, రాజ్ కుమార్, బాలయ్య, ఉమెన్ వెల్ఫేర్ దేవిక, మహేష్ లు పాల్గొన్నారు.
