బలగం టీవి ,, ఎల్లారెడ్డిపేట
సింగిల్ విండో ఉద్యోగిని నిలదీసిన బండలింగం పల్లి గ్రామస్థులు
ఆరు రూపాయలు పెంచి అమ్మాలని చూసిన సింగిల్ విండో అధికారులు
అప్పటికప్పుడు మూడు రూపాయలు దించిన సింగిల్ విండో అధికారులు
ఎల్లారెడ్డి పేట మండలంలోని బందలింగంపల్లి గ్రామానికి ఒక లారీలో ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో నుండి ఒక లారీలో 500బస్తాల యూరియా పంపిణీ కోసం సోమవారం ఉదయం పంపించారు.ఒక్కో యూరియా బస్తాకు 276 రూపాయలు తీసుకోవడం మొదలు పెట్టారు.కాగ యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు పక్కన ఉన్న ముస్తా బాద్ మండలం కొండాపూర్ లో 267 రూపాయలకు అమ్మితే మీరు 276 రూపాయలకు ఎలా అమ్ముతారని అక్కడికి వెళ్లిన సింగిల్ విండో ఉద్యోగిని నిలదీయగా చివరికి 270 రూపాయ లకు అమ్మడం ప్రారంబించారు.ఒక్కో యూరియా సంచికి సొసైటీ తరపున మూడు రూపాయలు అదనంగా 500 యూరియా సంచులకు తీసుకున్నారని రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.