బలగం టివి ,,రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులుగా శ్రీ పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సిరిసిల్ల పట్టణము కు వచ్చిన సందర్భంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ లో కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ గత ప్రభుత్వం హయాంలో అప్పటి మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కృషి వల్ల అప్పటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా విలీన గ్రామాలను పట్టణానికి కలుపుతూ లింక్ రోడ్ల ఏర్పాటు, వివిధ జంక్షన్ అభివృద్ధి, మురికి కాలువల నిర్మాణం వంటి మొదలగు మౌలిక వసతులు ప్రజలకు కల్పించడం కోసం 40 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించగా ఇట్టి అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తిచేసుకుని పనులు చేపట్టే దశలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ అభివృద్ధి పనులు నిలిపివేయబడినవి కాబట్టి ఇట్టి సమస్యను గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇట్టి అభివృద్ధి పనులు చేపట్టేలా అనుమతులు ఇప్పించాల్సిందిగా కోరగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
