బలగం, హైదరాబాద్:
హైదరాబాద్: హైకోర్టులో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్న పల్లె నాగేశ్వరరావు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించిన నేపధ్యంలో. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాం ప్రసాద్ అభినందనలు తెలిపారు.శుక్రవారం నాగేశ్వర రావును కలిసి సత్కరించారు. సీనియర్ న్యాయవాది కార్తిక్ నవ్యాన్ మరియు న్యాయవాది గుంపుల స్వప్నలతో కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపినట్లు బత్తుల రాంప్రసాద్ పేర్కొన్నారు.