స్థానిక సంస్థల్లో ప్రజలే బుద్ధి చెప్తారు
కాంగ్రెస్, బిజెపి తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు
- బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అందే సుభాష్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అందే సుభాష్ మాట్లాడుతూ, ఆంధ్ర మీడియాతో కాంగ్రెస్, బిజెపి బీఆర్ఎస్ పార్టీపై విషప్రయోగం చేస్తుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్తారని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు తుంగలో తొక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలించిన పది సంవత్సరాలలో కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్, కేటీఆర్ ల పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గెల్లు శ్రీనివాస్ మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారని వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుడి పేరుతో చలామణి అవుతున్న గజ్జలకాంతం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఇంకొకసారి తెలంగాణ ఉద్యమ నాయకులను విమర్శిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, వరుస కృష్ణ హరి, శ్రీనివాస్, పందిర్ల పరుశురాం గౌడ్, ఎనగందుల నరసింహులు, తిరుపతి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
