➡️కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదు
➡️ యాసంగి పంటకు రైతులకు ఇస్తామన్న బోనస్ ఎఫ్రీల్,మే మాసాల్లో ఇవ్వాలి
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
➡️కొత్త జిల్లాల మార్పు అంటే ఊరుకునేది లేదు
➡️మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం.
➡️ప్రాజెక్టుల సామర్థ్యం పెరగడంతోనే అంచనా వ్యయం పెరిగింది
➡️కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం నిరంతరం శ్రమించాం
➡️రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరాలి
➡️బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.
➡️ఐదేళ్ల పాలన కాలంలో పొన్నం ప్రభాకర్ రైల్వే ప్రాజెక్టు కోసం నిధులు తేలేదు
➡️2014లో ఎంపీగా గెలిచి కరీంనగర్ కు ₹వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చాను
➡️కరీంనగర్ నుంచి మనోహరబాద్ వరకు రైల్వే ప్రాజెక్టు తెచ్చాను
➡️బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం అభివృద్ధి చేశాడు
➡️తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎన్నడూ గొంతెత్తి మాట్లాడలేదు
➡️పార్లమెంట్ లో విభజన హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతునయ్యాను
➡️తెలంగాణ లో విద్యుత్ ఉత్పత్తి, ఇరిగేషన్ ప్రాజెక్టులు,కాల్వల నిర్మాణం కోసమే అప్పులు చేశాము
➡️తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది
➡️కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ లో 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
బలగం టీవి, ఇల్లంతకుంట :
అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, సాధ్యంకానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని , తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు ₹7700ల కోట్లు నిధులు కేటాయిస్తే రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు నిలిపి వేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారని…రైతులను ఎందుకు విస్మరించారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈంసందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ 2004లో ఐదుగురు ఎంపీలు గెలిచి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ గారితో కలిసి గళమెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోతల పథకంలో 45టీఎంసీల సామర్థ్యం ఉన్న చిన్న ,చిన్న రిజర్వయర్ల సామర్థ్యం 250 టీఎంసీలకు పెంచడంతోనే అంచనా వ్యయం పెరిగిందని పేర్కొన్నారు.
2006లో తెలంగాణ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, 2009లో మళ్ళీ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళితే 2014లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 2014లో కేసీఆర్ గారు సీఎం అయ్యాక రోజుకు 18 గంటలు పని చేశారని…కేవలం.మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.
కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంపై ఫైనాన్స్ మంత్రి, ఉన్నతాధికారులతో పది సార్లు చర్చించి నిర్ణయం తీసుకునేవారని అన్నారు. ప్రజలకు ఏది కావాలో ఆలోచన చేసి అమలు చేసేవారన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచే ప్రసక్తే లేదని, బలమైన ప్రతిపక్షంగా నిలబడి అధికారపక్షంపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు.
కేంద్రంలో పదేళ్ల కాలంగా ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నారని 2014 నుంచి 2019 వరకు తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ గారితో చర్చించి కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మానేరు రివర్ ప్రంట్ తో పాటు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చెయడం జరిగిందన్నారు.
జాతీయ రహాదారుల కోసం కొట్లాడి కరీంనగర్ చుట్టుపక్కల నాలుగు జాతీయ రహాదారులను నిర్మాణం చేయించడం జరిగిందన్నారు.
2004లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు రైల్వేలైన్ కావాలని ఆడిగి మంజూరు చేయించామని,2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వే ప్రాజెక్టు ను పట్టించుకోలేదన్నారు.
2014లో తాను కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ కరీంనగర్ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కిందని పేర్కొన్నారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారని, ఎన్ని నిధులు తీసుకువచ్చారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరీంనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం బండి సంజయ్ నయాపైసా నిధులు తేలేదు…నిధులు తెచ్చానని బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా… తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పును సిరసావహిస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని, కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్ ,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు చల్ల నారాయణ, రైతుబంధు సుమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు,ఏఎంసీ వైస్ చైర్మన్ చందన్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.