బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బాధిత కుటుంబానికి 12వేల రూపాయల ఆర్థిక సాయం అందజేత..
తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామానికి చెందిన రాగుల దేవయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల రోజులపాటు కరీంనగర్ సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నేత జూపల్లి రాజేశ్వర్ రావు పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా కలెక్ట్ చేసిన 12 వేల రూపాయల మొత్తాన్ని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతలు మందాటి తిరుపతి యాదవ్,జూపల్లి రాజేశ్వర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత పేద కుటుంబానికి సాయం అందించి అండగా నిలిచిన జూపల్లి రాజేశ్వర్ రావు కు గ్రామస్తులు,నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆత్మకూరి నాగరాజు,నక్క సురేష్,గాదం తిరుపతి,రాజు,కావటి మల్లేశం,గుండవేని మహేష్,ఆత్మకూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.