బలగం టీవి , గంభీరావుపేట :
గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ కారణాల చేత మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అండగా నిలుస్తున్నాడు. చనిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన టేకుమల్ల రాజశేఖర్, మహమ్మద్ గౌస్ మరియు ఈరవేణి బాలయ్య కుటుంబాలకు ఒక్కొక్కరి కుటుంబాలకు 25 కేజీల బియ్యాన్ని అందించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏడబోయిన ప్రభాకర్ ,మల్యాల రాజ్వీర్,అరవింద్ ,చందు ,నరేష్ ,అర్మాన్ ,ఆమీర్ తదితరులు పాల్గొన్నారు