ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలంలో ఇద్దరు కళాకారులకు జాతీయస్థాయిలో కళా రత్న అవార్డులు రావడంతో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శామంతుల అనిల్ ఆర్టిస్టుగా ఎదిగి పేరు తెచ్చుకోవడంతో కళారంగంలో అనిల్,దుంపెన రమేష్ లకు హరితహారం పెంచడంలో అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులను రెండు రోజుల క్రితం విజయవాడ పట్టణంలో అందజేశారు.నాలుగు రాష్ట్రాలలో కళాకారులను ఎంపిక చేసి ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇద్దరికీ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు సూడిది రాజేందర్, రాజు నాయక్,ఎండి హిమామ్, చెన్ని బాబు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.