వన దేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే

0
107

బలగం టివి,  ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వన దేవతలు అయినటువంటి సమ్మక్క సారలమ్మ దేవతలను శుక్రవారం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు.సమ్మక్క సారలమ్మ గద్దె కు కేక్ మహేందర్ రెడ్డి చేరుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో పాడిపంటలతో పిల్లా జెల్లాను సల్లంగా చూసుకోవాలి కోరుతూ కొబ్బరి కాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు.సమ్మక్క సారలమ్మ గద్దె కు చేరుకున్న కేకే మహేందర్ రెడ్డి ని ఆయన తో పాటు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లను ఆలయకమీటీ వారితో కలిసి మాజీ సర్పంచ్ కొండాపూర్ బాల్ రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు.సమ్మక్క సారలమ్మ దేవతలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఎల్లారెడ్డిపేట మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి,కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, బొప్పాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కిష్టారెడ్డి, గొల్లపల్లి అధ్యక్షులు గుండ్ల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి,గంట బుచ్చ గౌడ్,నరేందర్,బీపేట రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here