తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామనికి చెందిన సిలివేరి నాంపల్లి మస్కట్ దేశంలో గుండె పోటుతో మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతా కేకే మహేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో పోన్ లో మాట్లాడి ప్రభుత్వ పరంగ అదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందాటి తిరుపతి యాదవ్, సత్తు శ్రీనివాస్ రెడ్డి,ఆత్మకూరు నాగరాజు,సోల్ల రమేష్, కోలపురి శ్రీనివాస్,సుల్తాన్ శ్రీనివాస్, వెలిశాల వినోద్, బూరుగుపల్లి అజయ్,రేగుల బద్రి తదితరులు పాల్గొన్నారు.