బలగం టీవీ, హైదరాబాద్ :
ఇది ప్రజాపాలన కాదు .. రైతులను వేధించే పాలన
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మూడెకరాలు ఉన్న రైతులకూ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 44,82,265 మంది రైతుల ఖాతాలకు, 58.13 లక్షల ఎకరాల గాను రూ.3487.82 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. మూడెకరాల లోపు రైతులకు ఎంతోమందికి రైతుభరోసా నిధులు విడుదల కాలేదని మార్చి 31 వరకు అందరు రైతులకు రైతుభరోసా అందిస్తామని జనవరి 26న ప్రకటించారని అన్నారు.
రైతుభరోసా కోసం భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారని,కేవలం రూ.3487.82 కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లో జమచేసి సాగదీస్తున్నారని,మూడెకరాల వరకు మాత్రమే రైతుభరోసా కుదించే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదెకరాల వరకు రైతుభరోసా ఇస్తామని లీకులు ఇస్తుందని రాష్ట్రంలో 1.48 కోట్ల ఎకరాల భూమికి రైతుభరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు 58.13 లక్షల ఎకరాల వరకు మాత్రమే ఇప్పటి వరకు రైతుభరోసా అందించిందని,ప్రభుత్వ ప్రకటనలకు, పథకం అమలుకు ఏమాత్రం పొంతన కుదరడం లేదని అన్నారు.
పదేళ్లు ప్రగతిబాట పట్టిన తెలంగాణ వ్యవసాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, అన్నం పెట్టే అన్నదాతలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ అధోగతి పాలవుతున్నారని ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని రూ.12 వేలకు కుదించారని,రైతుభరోసా అమలు చేయడం చేతకాక రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారని ఆ సాయం కూడా రైతులకు అందించకుండా వేధించడం దారుణమని రైతుభరోసా పథకం అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమని అన్నారు.