స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ లు, కేంద్ర బలగాలు,జిల్లా పోలీసు బలగాలతో నిరంతరం గస్తీ:వినిత సాహు ఐపీఎస్.,
శాసన సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లును జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్., గారు ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి భద్రత ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సమీక్షించారు..
ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ….
సిరిసిల్ల , వేములవాడ లలో స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రంల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నీడలో, కేంద్ర, జిల్లా బలగాలతో పకడ్బంది నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.
అనంతరం సిరిసిల్ల, వేములవాడ నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ గారితో కలసి సందర్శించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సిరిసిల్ల, వేములవాడ లోని నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్త్,భద్రత ఏర్పాట్లు ను జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్ ఎం,గారికి వివరించారు.అనంతరం నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు.
పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 8121258834 కు ఫోన్ చేయవచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్., గారు తెలిపారు.
వీరి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, ఆర్.ఎస్.ఐ జునైద్ ఉన్నారు..