రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర: కాంగ్రెస్ శ్రేణుల భారీ ప్రదర్శన

0
151

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” నినాదాలతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్ స్టాండ్ మీదుగా లాహరి గ్రాండ్ వరకు కొనసాగింది. గాంధీ చౌరస్తా వద్ద ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ పాదయాత్రలో ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, పీసీసీ పరిశీలకులు కృష్ణా రెడ్డి, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here