బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామం బూత్ అధ్యక్షుడు గుంటి పర్షరాములు తండ్రి గుంటి భూమయ్య ఇటీవల మృతి చెందారు. అదే విధంగా ధర్మారంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పొట్ల బాలమల్లు గారి కుమారుడు పొట్ల రాకేష్ మృతి చెందాడు. నేడు వారి కుటుంబ సభ్యులను బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పరామర్శించారు. వారి వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజి రెడ్డి, కొనరావుపేట మండల్ అధ్యక్షుడు మిరాల్కర్ బాలాజీ మరియు మాజీ జెడ్పిటిసి పల్లం అన్నపూర్ణ మరియు మండల ప్రధాన కార్యదర్శి బైరగొని సురేష్ దేవరాజు సురేష్ రాజు రవి అభిషేక్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.