బలగం టీవీ, కథలాపూర్:
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు గంగారెడ్డి మరణించగా, విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

