బలగం టీవీ, తంగళ్లపల్లి:
బతుకు దెరువు కోసం వలస బాట పట్టి మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ సౌదీ అరేబియాలో ఇటీవలమూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి కేటీఆర్ చొరవతో స్వదేశానికి వచ్చి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి లో కేటీఆర్ 10 లక్షల రూపాయలతో చికిత్య చేయించారు. ఆస్పత్రిలో చికిత్య అనంతరం కోలుకున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మంద మహేష్ ని కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండల అధ్యక్షులు నందగిరి భాస్కర్ గౌడ్ మండేపెల్లి లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండేపల్లి కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బండి ప్రశాంత్, మాజీ సర్పంచ్ తంగళ్లపల్లి దేవయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుదాస్, ప్రశాంత్, రాజు, ప్రదీప్,విష్ణు, రంజిత్, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.

