బలగం టీవి , రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంకంపెట్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ మహబూబ్ ఖాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా
50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో
అగ్గి రాములు , గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, ఎర్రం(బస్సు) మల్లయ్య,కోడూరి మల్లేశం, మరియు కుటుంబ సభ్యులు హస్సేన్, హుస్సేన్ లు పాల్గొన్నారు.