బలగం టీవీ, సిరిసిల్ల:
సిక్కులవాడకు చెందిన చందన్ సింగ్ – జక్తీ దంపతుల కుమార్తె రాజేశ్వరి వివాహం నిశ్చయమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో, కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు ఆదివారం నాడు ఆ నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు నూతన వధువును ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
కౌన్సిలర్ చూపిన ఈ ఉదారతపై వధువు కుటుంబ సభ్యులు మరియు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచినందుకు కౌన్సిలర్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బైరి శేఖర్, గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య, కుల్ల శ్రీనివాస్, కోడూరి మల్లేశం, బింగి శ్రీధర్, బొల్లి అంబదాస్, వెంకటస్వామి గౌడ్ మరియు వధువు తరపు బంధుమిత్రులు పాల్గొన్నారు.


