బలగం టివి ,, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో సర్పంచ్ పద్మ దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మానం చేశారు.పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ తోటి వార్డు సభ్యులకు శాలువాలతో సన్మానించి సత్కరించారు.ఈ ఐదు సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించి ఆదరించి గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ ,ఉప సర్పంచ్ కృష్ణవేణి బాలకృష్ణ గౌడ్,వార్డు సభ్యులు దుర్గవ్వ,మానస, రాజు, రామస్వామి,నర్సవ్వ, రాజు,నర్సింలు వీరందరి సమన్వయంతో గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆత్మీయ సత్కారం చేయడం జరిగిందని సర్పంచ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయ బృందం అంగన్వాడీ టీచర్,ఆశ వర్కర్ గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.