బలగం టివి ,, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె గ్రామంలో సర్పంచ్ రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం చేశారు.పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ ధమ్మ రవీందర్ రెడ్డి తోటి వార్డు సభ్యులకు శాలువాలతో సన్మానించి సత్కరించారు.ఈ ఐదు సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించి ఆదరించి గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,కార్యదర్శి రత్నకుమారి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.