టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్
బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్ లకు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం ఆదేశానుసారం సాంస్కృతిక క్రీడల కార్యదర్శి గుజ్జే మనోహర్ నేతృత్వంలో శనివారం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ పోటీలను వేములవాడ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు.
ఈ క్రీడల్లో కోర్టు సిబ్బంది కోర్టు కానిస్టేబులు ఒక జట్టుగా, న్యాయవాదులు ఒక జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఎంతో రసవత్తరంగా సాగిన క్రికెట్ ఆటను సీనియర్ సివిల్ జడ్జి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు వీక్షించారు. క్రీడాకారులకు సీనియర్ సివిల్ జడ్జి టీషర్టులను అందించారు.
ఈ కార్యక్రమంలో బారా అసోసియేషన్ కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల గౌడ్, విద్యాసాగర్ రావు, శ్రీనివాస్, జనార్దన్, క్రాంతి కుమార్, సుధాకర్ రెడ్డి, పొత్తూరి అనిల్ కుమార్, దివాకర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.
