బలగం టీవి, తంగళ్లపల్లి :
మండలంలోని సారంపల్లి లో గత రెండు రోజుల నుండి క్రికెట్ క్రీడ పోటీలు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సంక్రాంతి సంబరాల లో భాగంగా నిర్వహించారు. ఇందులో ఆర్గనైజర్లుగా గుగ్గిల్ల రాము గౌడ్ గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలకు ఆర్గనైజర్ గా కోల శ్రీనివాస్ బరిగల రాజు కూడా తమ వంతు కృషి చేశారు. క్రికెట్ పోటీలకు సర్పంచ్ స్థానిక ఎంపిటిసి , సుంకటి సురేష్ ,గుగ్గిళ్ళలక్ష్మణ్ , అంబటి శేకర్ సహాయ సహకారాలు అందించారు. ఆర్గనైజర్ గుగ్గిల రామ్ మాట్లాడుతూ గెలుపు ఓటమి సహజం ప్రతి ఒక్కరు తమ శక్తి సామర్థ్యాల మేరకు క్రీడలు ఆడాలి క్రీడలు అనేవి శారీరక సామర్థ్యానికి మానసిక వికాసానికి దోహదం చేస్తాయని చదువుతోపాటు క్రీడలు కూడా ప్రతి వ్యక్తికి అవసరం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి సాలువాలతో మరియు విన్నర్ కప్ ఇచ్చి సత్కరించారు.