–నెల రోజుల కాలంలో కోర్టులో 07 కేసులలో నిందుతులకు శిక్షలు,జరిమానాలు.
అదనపు ఎస్పి చంద్రయ్య
బలగంటివి,సిరిసిల్ల :
నేరం చేసిన వారు ఎవరూ కుడా శిక్ష నుండి తప్పించుకొలేరని,పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా, శిక్షలు తప్పవని అదనపు ఎస్పి చంద్రయ్య అన్నారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోనీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో కన్విక్షన్ రేటు పెంచడానికి పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో ,కోర్ట్ డ్యూటీ అధికారులతో అదనపు ఎస్పి చంద్రయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ నేర నిరోధన, నేర పరిశోధన అనే అంశాలు విధి నిర్వహణలో అత్యంత కీలకమైనవని,ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని అన్నారు.నేరాలు దర్యాప్తు చేసే సందర్భాల్లో అత్యాధునికమైన నూతన టెక్నాలజీ వినియోగంతో శాస్త్రసాంకేతిక ఆధారాలతో పకడ్బందీగా నేరాల్లో దర్యాప్తు చేసి, సాక్ష్యలను కోర్ట్ లో ప్రవేశ పెట్టినప్పుడు తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడతాయని అన్నారు. పోలీసు దర్యాప్తులో భౌతిక సాక్ష్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం జోడించి న్యాయస్థానంలో అనుభవజ్ఞులైన ప్రాసిక్యూషన్ అధికారులచే గట్టి వాదనలు వినిపించడంతో నేరాలు ఋజూవు అవుతున్నయని అన్నారు. కన్విక్షన్ రేటు పెంచడానికి,నిష్పక్షపాత దర్యాప్తు చేస్తూ నేరస్తుల కు శిక్షలు పడేలా చేయడంలో పోలీస్ అధికారులకు, కోర్ట్ డ్యూటీ అధికారులకు నిర్వహించవలసిన విధి విధానాలపై పబ్లిక్ ప్రసిక్యూటర్స్ దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు లక్ష్మిప్రసాద్ ,శ్రీనివాస్ ,సందీప్ ,సతీష్ సిఐ ,ఎస్ఐ లు,కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
