బలగం టీవి, గంభీరావుపేట :
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరాలను కట్టడి చేయవచ్చని ఎల్లారెడ్డి పేట సీఐ శశిధర్ రెడ్డి అన్నారు.శనివారం గంభీరావుపేట మండలంలోని మల్లు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సై మహేష్ తో కలిసి సీఐ శశిధర్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానోదోహదపడుతాయన్నారు.మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన గ్రామస్తులను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.