అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసులు

0
141

– మండల ఎస్సై పృథ్వీధర్ గౌడ్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.. తేదీ 21/4/2025 రోజున పెట్రోలింగ్ డ్యూటీలో అనంతపల్లి గ్రామానికి వెళ్లగా అక్కడ టీఎస్ O2 యుఏ 6856 నెంబర్ గల ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టి ఇసుక ట్రాక్టర్లు ఆపి వారి పేర్లు తెలుసుకోగా సయ్యద్ అలీ మరియు ఎండి చిన్న మదర్ గ్రామం వట్టెం అని, వీరు వట్టెం గ్రామం నుండి అనంతపల్లి గ్రామానికి తమ ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నామని తెలుపగా వారిని మరియు ఇసుక ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఇరువురిని రిమాండ్ కు పంపించమైనదని ఎస్సై ప్రతిధర్ గౌడ్ తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి,జైలుకు పంపించడం జరుగుతుందని ఎస్ఐ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here