బలగంటివి,, తంగళ్ళపల్లి
మీ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీల సంగతి కేటీఆర్ ను అడిగే దమ్ము౦దా….
అధికారం లో ఉండి హామీలు అమలు చేయలేని బీఆర్ఎస్ దద్దమ్మలు
మంత్రి గారిని విమర్శించే నైతిక అర్హత బిఆర్ఎస్ సన్నాసులకు లేదు.
మార్పు కోరుకున్న తెలంగాణ సమాజం.
నిరంకుశ పాలన నుండి ప్రజా పాలన వైపు
మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుండి ఉద్యమాలే ఊపిరిగా ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ,చేస్తున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మొన్నటి రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పొన్నం గారు కార్యకర్తలపై ఉన్న చనువుతో ప్రేమ అభిమానాలు కురిపిస్తూ వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తు,గత ప్రభుత్వ దోపిడీ, నిరంకుశ పాలన వల్ల ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గురించి వివరిస్తున్నా క్రమంలో కొంతమంది బి ఆర్ ఎస్ సన్నాసులు వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ ను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం
బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఓర్వలేని కేటీ రామారావు గారు పార్టీ శ్రేణుల ద్వారా ఈ విధంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి,
కేసీఆర్,కేటీఆర్ దోపిడీని,దొరతనాన్ని ప్రశ్నించే దమ్ము లేని సన్నాసులు మీరా పొన్నం పై విమర్శలు,తప్పుడు ప్రచారాలు చేయడం.
కేటీఆర్ గారి వల్ల సిరిసిల్ల ప్రజలు ఎన్ని అవస్థలు పడిందో ఈ ప్రాంతం ఎంత నిర్వీర్యమైందో ఈ ప్రపంచానికి తెలవద్దని కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నాం._
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు