బలగం టివి,సిరిసిల్ల:
దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది . రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో జనసంద్రంగా మారాయి. అనంతరం అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
