బలగం టివి ,వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.