బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలో కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు పంట తూకంలో తరుగుతో కటింగ్ చేయడం ఏమిటని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బైటాయించిన ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి, పత్తికుంటపల్లె, కేశన్నపల్లె, ముస్కానీపేట, గాలిపల్లి రైతులు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు డి ఆర్ డి ఓ విచారణ చేపడుతామని, ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టు ఇవ్వకపోవడంపై అధికారుల తీరుపై మండిపడుతు బైఠాయించిన రైతులు.సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని భీష్మించి కూర్చున్న రైతులు. కలెక్టర్ ని మరోసారి కలిసి తమ బాధలు చెప్పుకుంటామని వేచి చూస్తున్న రైతులు.
