బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ నేరలపై అవగాహన పెంచుకోండి.
- సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే #Dial1930 కు కాల్ చేయండి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ నేరలపై అవగాహన పెంచుకోవలని , అప్రమత్తత, అవగాహన ద్వారానే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని,సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే(గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు రికవరీ సులభతరమవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదును నమోదు చేయండం ద్వారా మీ డబ్బును తిరిగి పొందే ఆస్కారం ఉంటుందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు..
- చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఒక వాట్సాప్ లో వచ్చిన పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి వాళ్లతో కాంటాక్ట్ కావడం జరిగింది. దానిలో భాగంగా మోసాగల్లు టాస్క్ ల పేరుతో తన వద్దనుండి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వారు అమౌంట్ పెట్టుబడి పెట్టించడం జరిగింది ఆ విధంగా బాధితులు 65,000/- రూపాయలు నష్టపోయారు.
- సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి ఇస్తామని చెప్పి వాట్సప్ లో చాట్ చేయాగా , అందులో ఇన్వెస్ట్మెంట్ రూపంలో బాదితులు వద్ద నుండి 50,000/- వేల రూపాయలను మోసగించడం జరిగింది.
- కొనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు మొబైల్ పోగొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ మొబైల్ ఫోన్ పే నుండి మొబైల్ దొoగిలించిన సస్పెక్ట్ 2,15,000/- రూపాయలను వేరే అకౌంట్ లోకి పంపించుకోవడం జరుగుతుంది కావున పిన్ నెంబర్ ఈజీ గా ఉంచుకోరాదు.
సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
- లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
- కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
- అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
- లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
- అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
- OLX, 99acres, Magic bricks లాంటి యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
- ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
- పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
- మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
- సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.