బలగం టివి,గంభీరావుపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్న పేట జడ్పి హైస్కూల్ ఫీజిక్స్ టిచర్ తాడూరి సంపత్ కుమార్ దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనడు. తాడూరి సంపత్ కుమార్ , బొమ్మలు-ఆటలతో సైన్స్ బోధన అనే పేరిట తయారుచేసిన ప్రదర్శన, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమస్థానం పోందాడు.దింతో అంద్ర ప్రదేశ్ లోని విజయవాడలోని మురళి కన్వెన్షన్ రిసార్ట్ లో నిర్వహిస్తున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనడు.ఆటలు బొమ్మలతో సైన్స్ ను భోదించుటకు ఎన్నో బోదన పరికరాలు తయారుచేసి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనందుకు సంపత్ కుమార్ ను జిల్లా విద్యాధికారి, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు అభినందించారు.
