బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైనందుకు దార్ల సందీప్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ పదవి దక్కేలా సహకరించిన 27 మంది తోటి కౌన్సిలర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన 34వ వార్డు ప్రజలతో పాటు, పట్టణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
తొలిసారిగా వైస్ చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సిరిసిల్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు. అందరి సహకారంతో పట్టణ సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా దారుల సందీప్ స్పష్టం చేశారు.
