బలగం టివి: సిరిసిల్ల
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దాసరి దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి రవీంద్ర శేషు ప్రకటించారు ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి రవీంద్ర శేషు ప్రకటించారు.ఈ సందర్భంగా దాసరి దేవేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా పోరాడుతానని తెలిపారు.జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దాసరి దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు జూనియర్ జర్నలిస్టులు అభిమానంతో ఘనంగా కృతజ్ఞతలు తెలుపడం జరిగింది