బలగంటివి, ,ముస్తాబాద్.
తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి తృతీయ బాహుమతి అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి దయానంద్. రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి సాధించిన సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్,టీఎంఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు హనుమాండ్లు ప్రధాన కార్యదర్శి అశోక్ ఉపాధ్యక్షుడు నల్ల పర్షరాములు,సీనియర్ ప్రధానోపాధ్యాయులు మనోరాచార్య విద్యాశాఖ కార్యాలయంలో విద్యార్ధి దయానంద్ ను అభినందించారు.