బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఇటివలే రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి గా నియమిత్తులైన సంగీతం శ్రీనివాస్ హైదరాబాద్ లోని డా.బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు డిసిసి అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మంత్రి డిసిసి అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కి సూచించారు.
