నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ అధికారి రాందాస్, ఏవో రాంరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


