బలగం టీవీ, హైదరాబాద్ :
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని, ప్రజాస్వామ్యం ఒడిపోయిందని కాంగ్రెస్, బిజెపి పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపిందని పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి, కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదని కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు.
ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయని కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని రాష్ట్ర స్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోందని,మూడు ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తుందని మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయవివాదం తలెత్తుతుందని జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఇది గంభీరమైన అంశం కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి నడుచుకోవాలని అన్నారు.