బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు (ఆదివారం) చేపట్టాల్సిన జిల్లా పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు సమీక్షా సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.
అయితే, కొన్ని అత్యవసర అధికారిక కార్యక్రమాలు మరియు ఇతర అనివార్య కారణాల రీత్యా ఈ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఈ మార్పును గమనించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు కార్యకర్తలు సహకరించాలని కోరడమైనది.
