*మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి.
బలగం టీవి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మొన్ననే జిల్లా కేంద్రంలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం పెట్టి వారి బిల్లుల కోసం పోరాడుతామని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.మంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలోని ఒక్క సర్పంచికి కూడా సమయం ఇవ్వకుండా అరిగోస పెట్టి వారి బిల్లులు కూడా చెల్లించకుండా ఆ బిల్లులను వేరే వైపు మల్లించి ఇప్పుడు బిల్లుల కోసం పోరాడుతామనడం విడ్డురంగా ఉందన్నారు.సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కేటీఆర్ ఎంపీ బండి సంజయే కారణమని వెల్లడించారు.ఇప్పటివరకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసి చేనేత కార్మికులను ఆర్థికంగా దెబ్బతీశారని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ వస్త్ర పరిశ్రమ కోసం ఏం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో పార్లమెంటు సభ్యునిగా ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేసి ఎన్నో నిధులు తీసుకొచ్చి సిరిసిల్ల నేతన్నల కోసం టెక్స్ టైల్ పార్కును తెచ్చారని,అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని గుర్తు చేశారు.మీరు మాత్రం మతాన్ని వాడుకుంటూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీపై ధ్వజమెత్తారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు ఎంపీటీసి శ్రీనివాస్ గౌడ్ మండల ఉపాధ్యక్షుడు తాడేపు కొమురయ్య ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింలు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ పాక్స్ డైరెక్టర్ దేవేందర్ మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షుడు కొండయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్ సీనియర్ నాయకులు రాజిరెడ్డి బాల్ రెడ్డి ఆంజనేయులు శ్రీనివాస్ సత్యంగౌడ్ దశరధం నవీన్ గౌడ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు